ప్రొడ్యూసర్ గా మారిన నాగశౌర్య

Wednesday,March 29,2017 - 05:20 by Z_CLU

మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో రెడీ అయిపోయాడు నాగశౌర్య. రీసెంట్ గా కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ‘కిరిక్ పార్టీ’ ఫేం రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని ఏప్రియల్ 10 న రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా లాంచ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.

సాగర్ మహతి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కి ఆల్ మోస్ట్ ప్యాకప్ చెప్పేసింది సినిమా యూనిట్. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ లవ్ ఎంటర్ టైనర్ తో వెంకి కుడుముల డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సెన్సిటివ్ లవ్ స్టోరీ తో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కనున్న ఈ సినిమా నాగశౌర్య కరియర్ లో బెస్ట్ ఎంటర్ టైనర్ లా నిలిచిపోవడం ఖాయమని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.