బన్ని ‘నా పేరు సూర్య’ టీజర్ లో హైలెట్ కానున్న ఎలిమెంట్

Saturday,December 30,2017 - 03:45 by Z_CLU

న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ కానుంది అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’.  అయితే బన్ని ఫ్యాన్స్ లో ఆల్ రెడీ రేజ్ అయిన క్యూరాసిటీని మైండ్ లో పెట్టుకున్న సినిమా యూనిట్, ఈ టీజర్ లో హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ ని  హైలెట్ చేయనుందని తెలుస్తుంది.

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్ని మిలటరీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. సినిమా ఎగ్జాక్ట్ థీమ్ ఇప్పటి వరకు రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేసిన టీమ్, న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రియల్ 27, 2018 ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకుంది. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తుంది.