2.0 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసిన రజినీకాంత్

Saturday,December 30,2017 - 04:47 by Z_CLU

రీసెంట్ గా చెన్నై లో ఫ్యాన్స్ మీటింగ్ లో పాల్గొన్న రజినీకాంత్ 2.0 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. 2.0 రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడానికి గ్రాఫిక్ వర్కే మెయిన్ రీజన్ అని చెప్పుకున్న రజినీకాంత్, ఒక్కో  ఫేజ్  లో  గ్రాఫిక్ వర్క్ కంప్లీట్  అయ్యాకే ఆ ఫైనల్ అవుట్ పుట్ ని బట్టి A.R. రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారని చెప్పుకున్న రజినీకాంత్, వరల్డ్ క్లాస్ క్వాలిటీ తో సినిమా తెరకెక్కుతుందని కన్ఫం చేశారు.

2.0 రిలీజైన 2 నెలల తరవాతే ‘కాలా’ రిలీజవుతుందని చెప్పిన రజినీకాంత్, ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ లా నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటెడ్ గా ఉందన్నారు. ఈ రెండు సినిమాల రిలీజ్ తరవాతే ఆ తరవాత ఏం చేయాలో డెసిషన్ తీసుకుంటాను అని చెప్పుకున్నారు సూపర్ స్టార్.