రవితేజ నెక్స్ట్ సినిమా హీరోయిన్ ఫిక్సయింది

Saturday,December 30,2017 - 02:03 by Z_CLU

కళ్యాణ్ కృష్ణ, రవితేజ సినిమాలో హీరోయిన్ ఫిక్సయింది. ‘టచ్ చేసి చూడు’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోవడంతో ప్రస్తుతం రవితేజ వచ్చే నెలలో సెట్స్ పైకి రానున్న తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మ్యాగ్జిమం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూనిట్ ఈ సినిమాతో మాళవికని టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేయనుంది.

 

జనవరి 5 నుండి సెట్స్ పైకి రానున్న ఈ సినిమా కళ్యాణ్ కృష్ణ మార్క్ తో పాటు, మాస్ మహారాజ్ రవితేజ స్టైల్ మాస్ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు.