బ్లాక్ బస్టర్ కాంబో... భారీ అంచనాలు

Sunday,October 28,2018 - 03:40 by Z_CLU

దళపతి విజయ్ , మురుగదాస్ కాంబినేషన్ లో ‘తుపాకి’,’కత్తి’ లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి… ఇప్పుడు ‘సర్కార్’ సినిమాతో మరోసారి ఈ ఇద్దరు ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న రిలీజ్ అవుతున్న ‘సర్కార్’ పై భారీ అంచనాలున్నాయి. ఇటివలే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసాయి. తమిళనాడులో ఇప్పటికే ఈ దాదాపు 200 బెన్ఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

కత్తి’,’తెరి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ‘అదిరింది’ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన విజయ్ ఈ పొలిటికల్ డ్రామాతో ఎలాంటి హిట్ సాదిస్తాడో. తెలియాలంటే దీపావళి వరకూ వెయిట్ చేయాల్సిందే.