చరణ్ బిజీ.. బిజీ.... ఫాన్స్ కి డబుల్ ధమాకా

Sunday,October 28,2018 - 02:02 by Z_CLU

వచ్చే ఏడాది ఫాన్స్ ని ఫుల్ ఖుషి చేయడానికి రెడీ అవుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఓ వైపు హీరోగా సినిమా చేస్తూనే మరో వైపు తండ్రి డ్రీం ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీ విజీ గా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి సినిమాకు సంబంధించి స్మాల్ బ్రేక్ తీసుకున్న చరణ్ నిర్మాతగా ‘సైరా’ పై పూర్తి ఫోకస్ పెట్టాడు.

ఈ రెండు సినిమాలతో నెక్స్ట్ ఇయర్ మెగా ఫాన్స్ కి డబుల్ ధమాకా అందించబోతున్నాడు. ప్రస్తుతం ‘సైరా’ షూట్ జార్జియాలో జరుగుతుంది. అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తున్నారు మేకర్స్.

వచ్చే ఏడాది జనవరి లో బోయపాటి సినిమాతో హీరోగా థియేటర్స్ లోకి అడుగుపెట్టబోతున్న చరణ్ అదే ఏడాది సమ్మర్ లో ‘సైరా’ తో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాదిస్తే అటు హీరోగా ఇటు నిర్మాతగా చెర్రీ ఫుల్ హ్యాపీ అన్నమాట.