జస్ట్ గ్లామరస్ రోల్సే కాదు.. అంతకు మించి

Friday,July 19,2019 - 10:03 by Z_CLU

జస్ట్ గ్లామరస్ రోల్స్ తోనే సరిపెట్టుకోవట్లేదు హీరోయిన్స్.. కథలో ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే సినిమాలు చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్థాయి క్యారెక్టరైజేషన్ అయితేనే సినిమాకి సంతకం చేస్తున్నారు. అదిరిపోయే పర్ఫామెన్స్ తో సినిమా సక్సెస్ కి రీజన్ అవుతున్నారు.

ఇస్మార్ట్ శంకర్ : సినిమాలో న్యూరో సైంటిస్ట్ గా నటించింది. సినిమాలో నిధి గ్లామరస్ పర్ఫామెన్స్ ఎన్ని మార్కులు పడ్డాయో.. న్యూరో సైంటిస్ట్ గా అంతే కీ రోల్ ప్లే చేసింది. కరియర్ బిగినింగ్ లోనే ఇలాంటి రోల్ దొరకడం నిధికి బాగా కలిసొచ్చింది.

డియర్ కామ్రేడ్ : రష్మిక ఏకంగా ‘డియర్ కామ్రేడ్’ కోసం క్రికెటర్ గా  బ్యాట్ పట్టేసింది. సినిమాలో స్టేట్ ప్లేయర్ గా కనిపించనుంది. గతంలో ‘దేవదాస్’ పోలీసాఫీసర్ గా ఇంప్రెస్ చేసింది. ఈసారి స్పోర్ట్స్ విమెన్ గా మెస్మరైజ్ చేయనుంది.

సాయి పల్లవి : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో డ్యాన్సర్ గా కనిపించనుంది సాయి పల్లవి. ఇది కొంచెం తన రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే క్యారెక్టరే… అందుకే సాయి పల్లవి అదరగొట్టడం గ్యారంటీ అనే వైబ్స్ ఉన్నాయి సినిమా చుట్టూరా…

సమంతా : కొత్త సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా కనిపించనుంది. గిరీశయ్య దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమా గురించి ఇంకా పెద్దగా డీటేల్స్ బయటికి రాలేదు కానీ, సమంతా మాత్రం ఇప్పటి వరకు ప్లే చేయని డిఫెరెంట్ షేడ్స్  లో కనిపించనుందని తెలుస్తుంది.

శ్రద్ధా కపూర్ : ‘సాహో’ లో ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుంది. జస్ట్ పేరుకే యూనిఫామ్ అన్నట్టుగా కాకుండా, సినిమాలో రోల్ కి తగ్గట్టుగా స్టంట్స్ కూడా చేసింది శ్రద్ధా.

వీటితో పాటు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ‘మిషన్ మంగళ్’ సినిమాలో నిత్యామీనన్ శాటిలైట్ కోడింగ్ ప్రొగ్రామర్ గా నటిస్తే… తాప్సీ నేవిగేషన్ కమ్యూనికేషన్ ఆఫీసర్ గా నటిస్తుంది. హీరోయిన్స్ పర్ఫామెన్స్ కేపబిలిటీస్ ని బట్టి , ఫిలిమ్ మేకర్స్ కూడా హీరోయిన్స్ కి అంతే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాసుకుంటున్నారు.