రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ తో నిరూపించాడు

Friday,July 19,2019 - 11:02 by Z_CLU

సెట్స్ పై ఉన్నంత వరకే సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ దే కానీ రిలీజయ్యాక మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా వన్ అండ్ ఓన్లీ రామ్ దే.  పూరి రాసుకున్న హైపర్ ఆక్టివ్ మాస్ క్యారెక్టర్ కి తన పర్ఫామెన్స్ తో ప్రాణం పోశాడు రామ్.

పూరి సినిమా అంటేనే ఈసారి హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అని వెయిట్ చేస్తారు ఆడియెన్స్. అలాంటిది ఈసారి ఉన్న బౌండరీస్ అన్నింటినీ దాటి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడిగా తనకి, హీరోగా రామ్ కూడా ఇప్పటి వరకు ట్రై చేయని క్యారెక్టర్ ని స్క్రీన్ పై ఎస్టాబ్లిష్ చేశాడు పూరి.

పూరి అద్భుతమైన క్యారెక్టర్స్ రాసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ ఏం కాదు కానీ, రామ్ ఇలాంటి సినిమా చేయాలని ఎంత గట్టిగా అనుకుని ఉంటాడో ’ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా కోసం జస్ట్ బాడీ లాంగ్వేజ్ ఒక్కటే కాదు… వాయిస్… చివరికి స్కిన్ టోన్ కూడా మార్చి ఈ సినిమాలో నటించాడు రామ్.

దర్శకులు హీరో క్యారెక్టర్ ని ఎలా రాసుకున్నా ఆ క్యారెక్టర్ ని ప్లే చేసిన వాళ్ళని బట్టే దాని ఎలివేషన్ ఉంటుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ చూసిన తరవాత హీరోగా రామ్ ని తప్ప ఇంకొకరిని కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేం. కాస్త ఎనర్జీ లెవెల్స్ తగ్గించకుండా రాసుకోవాలి కానీ ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసేయగలడు అని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు రామ్.