DJ Tillu 2 సిద్దుతో శ్రీలీల ?

Friday,August 19,2022 - 05:28 by Z_CLU

ఈ ఏడాది పెద్ద హిట్టయిన చిన్న సినిమాల్లో డీజే టిల్లు మొదటి వరుసలో ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఇండస్ట్రీ షాక్ ఇచ్చింది. సినిమా పెద్ద హిట్టవ్వడం, యూత్ లో క్రేజ్ తెచ్చుకోవడంతో వెంటనే మేకర్స్ ‘డీజే టిల్లు 2’ ఎనౌన్స్ చేశారు. ఇటివలే సీక్వెల్ రెడీ అవుతుందని ఓ వీడియో ద్వారా తెలియజేశారు. ‘టిల్లు 2’ అని వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు.  త్వరలోనే ప్రాజెక్ట్ కి కొబ్బరి కాయ కొట్టి షూటింగ్ మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది.

అయితే ఈ సీక్వెల్ లో ఈసారి నేహా శెట్టి కాకుండా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న శ్రీ లీల ని పెట్టుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతానికైతే మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు కానీ రవితేజ బ్యూటీ ఈ సినిమాకు ఫిక్స్ అంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉంది. త్వరలోనే రవితేజ ‘ధమాకా’ తో ప్రేక్షకుల ముందకు రాబోతుంది.

డీజే టిల్లు లో రాధికా కేరెక్టర్ తో నేహా శెట్టి హీరోయిన్ గా మంచి మార్కులు అందుకుంది. సినిమా విజయంలో ఆమె పాత్ర కీలకం అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు శ్రీలీల ఆమెను మించేలా ఆ పాత్రను చేస్తుందా ? లేదా చూడాలి. ఏదేమైనా త్వరలోనే టిల్లు 2 హీరోయిన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics