SSMB28 అందరికీ నచ్చే స్క్రిప్ట్ తో త్రివిక్రమ్

Friday,August 19,2022 - 05:48 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న SSMB 28 సినిమా మీద భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టే అన్ని విధాలుగా అందరికీ నచ్చే స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడట త్రివిక్రమ్. లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ సీన్స్ , కామెడీ తో సరదాగా ఉంటుందని , సెకండాఫ్ లో ఫ్యాన్స్ , మాస్ ఆడియన్స్ ని  మెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే ఓ ఛేజ్ కూడా ఉండనుందని తెలుస్తుంది. అంతే కాదు ఇంటర్వల్ లో ఓ ట్విస్ట్ ఉంటుందని అది మెప్పిస్తుందని టాక్ ఉంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో మహేష్ టైమింగ్ తో హిలేరియస్ కామెడీ ట్రాక్ ఉండనుందని అంటున్నారు. మహేష్ లుక్ కూడా అదిరిపోయేలా ఉంటుందని చెప్తున్నారు.

ఇటు క్లాస్ అటు మాస్ కి నచ్చే విధంగా మహేష్ తో సినిమా చేయనున్నాడట త్రివిక్రమ్. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తీసిన ‘అల వైకుంఠ పురములో’ కూడా క్లాస్ మాస్ రెండు రకాల ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండించింది. ఈసారి కూడా త్రివిక్రమ్  అదే ఫార్మేట్ లో సూపర్ స్టార్ తో సినిమా చేయబోతున్నాడని టాక్.

తమన్ ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసి కొన్ని సాంగ్స్ కూడా కంపోజ్ చేసుకున్నాడట. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ ఎండింగ్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ కాంబో మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics