Interview - సయీ మంజ్రేకర్‌ (గని)

Tuesday,April 05,2022 - 04:34 by Z_CLU

Heroine Saiee Manjrekar Interview about ‘Ghani’

దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్‌ మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సయీ మంజ్రేకర్‌. ‘దబాంగ్‌3’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘గని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ సయీ మంజ్రేకర్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…

 

టాలీవుడ్ అంటే ప్ర‌త్యేక అభిమానం

టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌, పవన్‌, రామ్‌చరణ్‌ అంటే చాలా ఇష్టం. నేను తెలుగు సినిమాలు కూడా చేస్తాను. రామ్‌చరణ్‌ నటించిన ‘మగధీర’  బాగా నచ్చింది. అలాగే బన్నీ నటించిన ‘పుష్ప’ సినిమాకి ఫిదా అయిపోయాను. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ ఫాలోయింగ్‌ చూసి ఆశ్చర్యపోయాను. ఆయన నటించిన ‘వకీల్‌సాబ్‌’ సినిమా చూశాను. తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్‌లో చూస్తాను. టాలీవుడ్‌పై నాకు చాలా రెస్పెక్ట్ ఉంది.

 

తెలుగు సినిమాలు… ఊహించ‌లేదు

 ‘దబాంగ్‌ 3’ ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ని కలవడం గొప్ప అనుభూతి. ఆ సమయంలో నేను తెలుగు సినిమాలు చేస్తానని అస్సలు ఊహించ లేదు.  అన్నిరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. తెలుగు, హిందీలోనే కాదు సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించాలని ఉంది.  ఎలాంటి లిమిట్స్ లేవు. నాకు ఎలాంటి కెరీర్‌ ప్లానింగ్‌ కూడా లేవు. వచ్చిన ఆఫర్స్ లో మంచి ప్రాజెక్ట్ లు చేసుకుంటూ వెళ్తాను.  మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో క‌లిసి పనిచేయ‌డం ఆనందంగా ఉంది. వ‌రుణ్ ఓ మంచి కోస్టార్. ‘గని’ సినిమాపై చాలా హోప్స్ తో ఉన్నాను. ప్రస్తుతం అడివి శేష్ తో ‘మేజర్‌’ సినిమాలో నటిస్తున్నాను.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics