Beast తెలుగు ట్రైలర్ వచ్చేసింది

Tuesday,April 05,2022 - 05:20 by Z_CLU

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ , డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బీస్ట్’ రిలీజ్ కి రెడీ అవుతోంది . ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘బీస్ట్’  తెలుగులో డబ్బింగ్ సినిమాగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బేనర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

ట్రైలర్ లో సినిమా థీమ్ ఏంటనేది క్లియర్ కట్ చెప్పేసి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో 2 నిమిషాల 55 సెకన్ల ట్రైలర్ తో చూపించాడు దర్శకుడు నెల్సన్.  ముఖ్యంగా విజయ్ హీరోయిజం ఎలివేట్ చేసే షాట్స్ , అనిరుద్ స్కోర్ , మనోజ్ పరమహంస విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ బిట్స్  ట్రైలర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి.

విజయ్ సరసన పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో సెల్వ రాఘవన్ ఓ కీలక పాత్రలో నటించారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఎండింగ్ లో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 13న థియేటర్స్ లోకి రానుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics