బాలయ్య సినిమాకు హీరోయిన్ ఫిక్స్

Sunday,March 26,2017 - 01:53 by Z_CLU

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీకి ముగ్గురు హీరోయిన్లు కావాలి. వాళ్లను ఎంపిక చేసే బాధ్యతను చార్మికి అప్పగించాడు పూరి జగన్నాధ్. పూరి కనెక్ట్స్ అనే సంస్థ ద్వారా ముగ్గురు ముద్దుగుమ్మల్ని బాలయ్య సరసన ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ముద్దుగుమ్మను ఆల్రెడీ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఆ అమ్మాయితో ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది.

బాలయ్య-పూరి సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. హైదరాబాద్ లో బాలయ్యపై ఓ భారీ ఫైట్ సీక్వెన్ తీశారు. వచ్చేనెల 5 నుంచి హైదరాబాద్ లోనే మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ లో కొత్త హీరోయిన్ ను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. మిగతా ఇద్దరు హీరోయిన్లను ఇంకా ఎంపిక చేయలేదు.

తాజా సమాచారం ప్రకారం, బాలయ్య సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకొని, మిగతా ఇద్దరు హీరోయిన్లను కొత్తమ్మాయిలతో నెట్టుకొచ్చేయాలని చూస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.