లాక్ డౌన్ తర్వాత మొదలైన మొదటి సినిమా ఇదే

Sunday,June 14,2020 - 11:20 by Z_CLU

ఈ లాక్ డౌన్ టైమ్ లో రవిబాబు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. కరోనా షేపులో కేకు తయారుచేసి క్వారంటైన్ యానివర్సరీ చేశాడు. షాపింగ్ మాల్ కు వెళ్లి రివర్స్ లో సెక్యూరిటీని థర్మల్ స్క్రీనింగ్ చేశాడు. ఇలా రకరకాలుగా ఎంటర్ టైన్ మెంట్ అందించిన రవిబాబు.. పర్మిషన్ వచ్చిన వెంటనే తన సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ‘క్రష్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు పెద్ద సినిమాల షూటింగ్స్ ఏవీ మొదలు కాలేదు. కానీ రవిబాబు మాత్రం ధైర్యం చేశాడు. తన సినిమా షూటింగ్ మొదలు పెట్టేసాడు. లాక్‌డౌన్ తర్వాత మొదలు పెట్టిన తొలి తెలుగు సినిమా షూటింగ్ ఇదే.

కరోనా టైమ్ లో కౌగిలింతలు ఎలా ఉంటాయో కూడా తన సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు రవిబాబు. దీన్ని కూడా ఎంతో కామెడీగా చూపించాడు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బాబు ప్రజెంటర్ గా ఉన్నాడు.