జీ సినిమాలు ( 30th మార్చి )

Thursday,March 29,2018 - 10:06 by Z_CLU

 

శశిరేఖా పరిణయం

హీరో  హీరోయిన్లు – తరుణ్ ,జెనీలియా

ఇతర నటీనటులు – పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, రఘు బాబు తదితరులు

సంగీతం      –  మణిశర్మ, విద్య సాగర్

దర్శకత్వం  –  కృష్ణ వంశీ

విడుదల తేదీ – 2009

 వరుస ప్రేమ కథా చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకొని లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘శశిరేఖ పరిణయం’. జెనీలియా శశి రేఖ గా నటించిన ఈ చిత్రం  2009 లో విడుదలైంది. ఈ చిత్రం తో తొలి సారిగా జత కట్టారు తరుణ్-జెనీలియా. కాబోయే భార్య భర్తల మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా అలరించింది. ఈ చిత్రం లో పెళ్లంటే భయపడే అమ్మాయి పాత్రలో  జెనీలియా నటన, ఒక అమ్మాయి గురించి తన జీవితం గురించి ఆలోచించే యువకుడి పాత్రలో తరుణ్ అందరినీ ఆకట్టుకున్నారు. తన ప్రతి సినిమాలో కుటుంబ విలువలను చాటి చెప్పే క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని కూడా అదే కోవలో ఫ్యామిలీ అంశాలతో కూడిన లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించి అలరించారు.

==============================================================================

సూరిగాడు

నటీనటులు : సురేష్, యమున

ఇతర నటీనటులు : దాసరి నారాయణ రావు, సుజాత, సురేష్, గొల్లపూడి, వేలు, రాళ్ళపల్లి, కాంతారావు, బ్రహ్మానందం, బాబూ మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వాసూ రావు

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్:  1992

కష్టపడి పెంచిన తలిదండ్రులను కన్నా బిడ్డలే పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించారు డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ సినిమాలో తండ్రి పాత్ర కూడా స్వయంగా ఆయనే పోషించారు. ఈ సినిమాలో ‘ఒకే ఒక ఆశ’ అంటూ సాగే పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

బాలు

హీరో హీరోయిన్లు : పవన్ కళ్యాణ్శ్రియ శరన్నేహ ఒబెరాయ్

ఇతర నటీనటులు : గుల్షన్సుమన్జయసుధతనికెళ్ళ భరణిసునీల్బ్రహ్మానందంఎం.ఎస్.నారాయణ తదితరులు 

సంగీతం : మణిశర్మ

దర్శకత్వం : కరుణాకరన్

నిర్మాత : అశ్విని దత్

విడుదల తేది : 6 జనవరి  2015

తొలి ప్రేమ తర్వాత  పవన్ కళ్యాణ్ -కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘బాలు‘. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను ఓ కొత్త కోణంలో ఆవిష్కరించింది. అటు చలాకీ కుర్రాడిగా ఎంటర్టైన్ చేస్తూనే మరో వైపు యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టేసాడు పవర్ స్టార్. మణిశర్మ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్.

==============================================================================

కందిరీగ

నటీనటులు : రామ్, హన్సిక  మోత్వాని

ఇతర నటీనటులు : అక్ష పార్ధసాని, జయ ప్రకాష్ రెడ్డి, సోను సూద్, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్, శ్రీనివాస రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011

ఎనర్జిటిక్ స్టార్ రామ్, హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది. 

==============================================================================

 

 

పవిత్ర ప్రేమ 

హీరో  హీరోయిన్లు బాలకృష్ణ, లైలా

ఇతర నటీనటులు రోషిని, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, పొన్నాంబలం

సంగీతం కోటి

దర్శకత్వం ముత్యాల  సుబ్బయ్య

విడుదల 1998, జూన్  4 

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి 1997లో పెద్దన్నయ్య, ముద్దుల మొగుడు అనే రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వాటి తర్వాత బాలయ్య సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 1998లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం పవిత్ర ప్రేమ. అప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లైలాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.