Republic Movie - రివ్యూ ఇచ్చిన నాని!

Thursday,September 30,2021 - 06:20 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ -దేవకట్టా కాంబినేషన్ లో సోషల్ డ్రామాగా తెరకెక్కిన ‘రిపబ్లిక్’ సినిమా రేపే థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తూ ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. ఈ క్రమంలో ఈ సినిమా చూడటం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన లేకపోయాడు తేజ్. ఇక తేజ్ ప్రమోషన్స్ లో కనిపించని లోటుని మెగా బ్రదర్స్ భర్తీ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.

రేపు రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాను ముందే చూసిన నాని లేటెస్ట్ గా తన రివ్యూ ఇచ్చాడు. హీరో నాని ఇచ్చిన రివ్యూ సినిమాపై మరింత ఎక్స్ పెక్టేషన్స్ పెంచేలా ఉంది. సినిమాలో తేజ్ నటన గురించి చెప్తూ దేవకట్టా కి మంచి కంబ్యాక్ సినిమా అవుతుందని ట్వీట్ ద్వారా తెలిపాడు నాని. అంతే కాదు రిలీజ్ కి ముందే టీం కి కంగ్రాట్స్ కూడా చెప్పాడు. సో నాని సినిమా గురించి ఇంత గట్టిగా చెప్పడం పైగా దేవకట్టా ఈ సినిమాతో ఐయాం బ్యాక్ అని గట్టిగా చెప్పాడు అంటూ పొగడంతో సినిమాపై ఉన్న మోస్తారు అంచనాలు మరింత స్థాయికి పెరిగాయి.

Nani-new-look1

JB ఎంటర్టైన్ మెంట్స్ , జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు సెన్సార్ నుండి కూడా మంచి అభినందనలు దక్కాయి. ఆ విషయాన్ని ఇటివలే దేవకట్టా తెలిపాడు. మరి రిలీజ్ కి ముందే అందరినీ ఆకట్టుకుంటూ మంచి సినిమా అనిపించుకుంటున్న ‘రిపబ్లిక్’ రేపు ఎలాంటి వసూళ్ళు రాబడుతుందో ? ఎంతటి ఘన విజయం సాధిస్తుందో చూడాలి. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు , రమ్య కృష్ణ కీ రోల్స్ లో కనిపించనున్నారు. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics