#Akhanda - కొత్తగా కనపడతా!

Thursday,September 30,2021 - 05:58 by Z_CLU

ప్రస్తుతం నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసేందుకు నటులందరూ ఆసక్తి చూపిస్తున్నారు. సీనియర్స్ నుండి యంగ్ హీరోల వరకు ఇలాంటి రోల్స్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే జగపతి బాబు లాంటి హీరోలు విలనీ క్యారెక్టర్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నారు. త్వరలోనే ఆ లిస్టు లో శ్రీకాంత్ కూడా చేరబోతున్నాడు. అవును ‘అఖండ’ తో పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు శ్రీకాంత్.

అయితే శ్రీకాంత్ విలన్ గా కనిపించడం ఇదేం కొత్త కాదు. నాగ చైతన్య హీరోగా నటించిన ‘యుద్ధం శరణం’ అనే సినిమాలో విలన్ గా టర్న్ అయి కొత్తగా ట్రై చేశాడు. కానీ ఆ సినిమాతో సక్సెస్ ఫుల్ విలన్ అనిపించుకోలేకపోయాడు. అందుకే ఈసారి బోయపాటి -బాలయ్య కాంబో సినిమాలో విలన్ గా చేస్తూ ఈసారి ఎలాగైనా ఆడియన్స్ ని విలన్ గా భయపెట్టాలని చూస్తున్నాడు.

srikanth

తాజాగా ఈ సినిమాలో గెటప్ గురించి ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు శ్రీకాంత్. అఖండ లో కొత్తగా కనిపిస్తానని తెలిపాడు. తన గెటప్ కోసం ముంబై నుండి డిజైనర్స్ చెప్పించి ఆ లుక్ డిజైన్ చేశారని చెప్పాడు. చాలా రగ్గెడ్ , రఫ్ లుక్ లో కనిపిస్తానని , ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా ? అని ఎదురుచూస్తున్నానని చెప్పుకున్నాడు. మరి ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ మరిన్ని విలన్ క్యారెక్టర్స్ అందుకుంటాడా ? వేచి చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics