Allari Naresh - 59వ చిత్రం మొదలైంది

Tuesday,February 01,2022 - 03:50 by Z_CLU

Hasya Movies, Zee Studios announce a new movie with Allari Naresh as hero

అల్లరి నరేష్ హీరోగా కొత్త సినిమా ప్రారభమైంది. ఇవ్వాళ హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలతో సినిమాను మొదలు పెట్టారు. రాజ్ మోహన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవ్వనున్నాడు. Zee Studios , హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు.

ఇటివలే శ్రీదేవి సోడా సెంటర్ లో సుదీర్ బాబుతో జోడీ కట్టిన ఆనంది ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు అందిస్తుండగా శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. కామెడీతో పాటు లవ్ , ఎమోషన్స్ మిక్సయిన సోషల్ డ్రామా కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే మిగతా డీటెయిల్స్ తెలియనున్నాయి.

‘మహర్షి’ , ‘నాంది’ వంటి సినిమాల్లో తన నటనతో మరోసారి ఆకట్టుకున్న అల్లరి నరేష్ మళ్ళీ ఓ మంచి మెసేజ్ సినిమాతో రాబోతున్నాడు. బంగార్రాజు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జీ స్టూడియోస్ సంస్థ నుండి వస్తున్న సినిమా ఇది.

allari naresh zee studios movie allari naresh zee studios movie