BheemlaNayak Ghani - రెండేసి డేట్స్ తో బాబాయ్ అబ్బాయ్

Tuesday,February 01,2022 - 04:05 by Z_CLU

Bheemla Nayak and Ghani announces 2 release dates each

ఉన్నపళంగా బడా సినిమాలకు సంబంధించి ఒకే రోజు రిలీజ్ డేట్స్ వచ్చేశాయి. దీంతో అందరి హీరోల అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ మెగా అభిమానుల్లో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. దీనికి రీజన్ ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోవడమే. అవును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి రెండు డేట్స్ ఎనౌన్స్ చేశారు. అందులో ఒకటి ఫిబ్రవరి 25 అంటే సరిగ్గా ఇరవై నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఇంకొకటి ఏప్రిల్ 1 న. ఈ డేట్ కి ముందు ‘ఆచార్య’ ప్రకటించారు. కానీ తాజాగా ఏప్రిల్ 29కి సినిమాను వాయిదా వేసుకున్నారు. అయితే ఇలా రెండు డేట్స్ ప్రకటించింది ముందుగా రాజమౌళి. RRR కి సంబంధించి రెండు డేట్స్ లాక్ చేసి ఫైనల్ ఆ రెండిటిలో లేని కొత్త డేట్ చెప్పి ఎనౌన్స్ చేశారు.

RRR స్టాటజీనే ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ టీం ఫాలో అవుతున్నారు. ఇక బాబాయ్ సినిమానే కాదు అబ్బాయ్ కూడా ఇలా రెండు డేట్స్ చెప్పి ఫ్యాన్స్ ని డైలమాలో పెట్టాడు. ‘గని’ సినిమా ముందుగా ఫిబ్రవరి రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. కానీ మళ్ళీ రెండు డేట్స్ చెప్పారు. ఫిబ్రవరి 25న లేదా మార్చ్ 4న రిలీజ్ అంటూ పోస్టర్ ద్వారా ప్రకటించారు. నిజానికి గని టీం ఇలా రెండు డేట్స్ ప్రకటించడానికి రీజన్ ‘భీమ్లా నాయక్’ సినిమానే.

మేకర్స్ ప్రకటించిన డేట్స్ లో ఫిబ్రవరి 25న కానీ పవన్ కళ్యాణ్ , రానా సినిమా వస్తే గని ఆ డేట్ నుండి మార్చ్ 4 షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ భీమ్లా నాయక్ ఏప్రిల్ 1 కి వెళ్తే కనుక వెంటనే గని ఫిబ్రవరి 25 న థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఏదేమైనా ఇటు బాబాయ్ అటు అబ్బాయ్ ఇద్దరూ రెండు డేట్స్ ప్రకటించి ఇంకా రిలీజ్ పై కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఫైనల్ గా రిలీజ్ డేట్స్ ఎప్పుడు చెప్తారో చూడాలి.