నా పూర్తి ఫోకస్ ఆ సినిమా మీదే

Sunday,July 12,2020 - 12:49 by Z_CLU

లేటెస్ట్ గా ‘గద్దలకొండ గణేశ్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు హరీష్ శంకర్… తన నెక్ట్స్ మూవీకి పవన్ కళ్యాణ్ ను డైరక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్న హరీష్… సినిమాలో పవన్ ను మరోసారి అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపిస్తా అంటున్నాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడాడు హరీష్.

ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ పవన్ సినిమా మీదే ఉందని, ఆలస్యం అయినా మరో సినిమా చేసే ఆలోచనలో లేనని క్లారిటీ ఇచ్చాడు హరీష్. ఇక గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ ఎంత ఎనర్జిటిక్ గా కనిపించారో ఈ సినిమాలో కూడా అలాగే కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తారని అన్నాడు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే తెలియజేస్తానంటున్నాడు ఈ దర్శకుడు.