ఒకేసారి రెండు సినిమాలు

Sunday,July 12,2020 - 12:43 by Z_CLU

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న ‘లవ్ స్టోరి’ తర్వాత నాగ చైతన్య పరశురాం (బుజ్జి) డైరెక్షన్ లో ‘నాగేశ్వరావు’ అనే టైటిల్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోకుండా పరశురాం కి మహేష్ చాన్స్ ఇవ్వడంతో చైతు సినిమాను హోల్డ్ లో పెట్టాడు. దీంతో చైతూ ఒకేసారి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందులో ఒకటి విక్రమ్ కుమార్ సినిమా కాగా మరొకటి ఇంద్రగంటి మోహనకృష్ణ తో చేయనున్నాడని టాక్.

విక్రం కుమార్, చైతు కాంబినేషన్ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని సమాచారం. అలాగే ఇంద్రగంటి , చైతూ కాంబో సినిమాను మజిలీ నిర్మాతలు సాహూ, హరీష్ లు ప్రొడ్యూస్ చేస్తారని తెలుస్తుంది.

ఈ రెండు సినిమాలపై త్వరలోనే ప్రకటన రానుంది. మరి ఈ రెండు సినిమాలను చైతూ ఒకే సారి సెట్స్ పైకి తీసుకొచ్చి ఫినిష్ చేస్తాడా ? లేదా ఒకటి తర్వాత మరొకటి చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.