బాలీవుడ్ కు డీజే.. హరీష్ డెబ్యూ

Sunday,July 12,2020 - 01:05 by Z_CLU

తెలుగులో సూపర్ హిట్టయిన దువ్వాడ జగన్నాధమ్ సినిమా త్వరలోనే బాలీవుడ్ స్క్రీన్ పై ప్రత్యక్షం కాబోతోంది. ఈ మేరకు నిర్మాత దిల్ రాజు ప్లాన్స్ రెడీ చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే హరీష్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా బాలీవుడ్ కు పరిచయమవ్వబోతున్నాడు.

అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కింది దువ్వాడ జగన్నాధమ్. బన్నీ ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. పైకి పురోహితుడిగా కనిపిస్తూనే, తెరవెనక జేమ్స్ బాండ్ టైపులో అన్యాయాల్ని-అక్రమాల్ని అరికడుతుంటాడు. ఈ పాత్రకు బాలీవుడ్ లో ఎవరైతే బాగుంటుందా అనే చర్చలు ప్రస్తుతం నడుస్తున్నాయి.

చూస్తుంటే.. దిల్ రాజు బాలీవుడ్ పై గట్టిగానే ఫోకస్ పెట్టినట్టున్నాడు. ఇప్పటికే జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. బోనీకపూర్ తో కలిసి ఎఫ్-2ను రీమేక్ చేసే ప్లాన్స్ లో ఉన్నాడు. తాజాగా హిట్ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కూడా దక్కించుకున్నాడు. ఇప్పుడు డీజే సినిమాపై ఫోకస్ పెట్టాడు.