హర్భజన్ సింగ్ హీరోగా సినిమా

Tuesday,February 11,2020 - 11:55 by Z_CLU

ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ ఇంట్రో అక్కర్లేదు. తన స్పిన్ తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించాడు ఈ బౌలర్. తన సుదీర్ఘ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పిన బజ్జీ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అయ్యారు.

పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి ఒక సినిమాలో హీరోగా నటించేందుకు రెడీ అయ్యాడు. తమిళంలో ‘ఫ్రెండ్ షిప్’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్నఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్‌&స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రెండు చేతులకి ఒకే సంకెళ్లు వేసి ఉన్న ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని పలు ఇండియన్ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.