'భీష్మ' ... అదిరిపోనుందట !

Tuesday,February 11,2020 - 10:04 by Z_CLU

ఏ లవ్ స్టోరీ కయినా హీరో -హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం చాలా ముఖ్యం. అదొక్కటి వర్కౌట్ అయితే కథ ఎలా ఉన్న సన్నివేశాలు పండుతాయి. ప్రస్తుతం భీష్మ లో సినిమాలో అదే హైలిట్ అంటున్నారు. అవును సినిమాలో నితిన్ , రష్మిక కెమిస్ట్రీ కి వందకి వంద మార్కులు పదనున్నాయట. ఇప్పటికే టీజర్స్, సాంగ్స్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

అయితే ఇది జస్ట్ సాంపుల్ అని సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కి థియేటర్స్ లో మాములు రెస్పాన్స్ ఉండదనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ఏదేమైనా భీష్మకి నితిన్-రష్మిక కెమిస్ట్రీ మేజర్ ప్లస్ అయ్యేలా ఉంది. మరి ఈ నెలలోనే  వస్తున్న ఈ సినిమా ఎలాంటి హిట్ సాధిస్తుందో చూడాలి.

వెంకీ కుడుముల డైరెక్షన్ లో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు.