పవన్ కల్యాణ్ గారికి నా రిక్వెస్ట్

Tuesday,March 27,2018 - 11:38 by Z_CLU

అజ్ఞాతవాసి రిలీజ్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో కనిపించని పవర్ స్టార్ ఎట్టకేలకు ఛల్ మోహన్ రంగ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మెరిశారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ సందర్భంగా హీరో, పవన్ వీరాభిమాని నితిన్ ఓ ప్రత్యేక విన్నపం చేశాడు.

“మా ఫ్యాన్స్ నుంచి పవన్ కల్యాణ్‌గారికి చిన్న రిక్వెస్ట్. ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ గారు ఏ ఫీల్డ్ కి వెళ్లినా స‌క్సెస్ అవుతారు. ఆయ‌న నోటి వెంట `సినిమాలు చేయ‌ను` అని అంటే మా లాంటి ఫ్యాన్స్ త‌ట్టుకోలేం. ఎప్పుడో ఒక సినిమా చేయ‌క‌పోతారా అనే హోప్‌తో ఉంటాం. దయచేసి సినిమాలు చేయనని మాత్రం చెప్పొద్దు సర్.”

పవన్ ను ఇలా అందరి ముందు రిక్వెస్ట్ చేశాడు నితిన్. ఫుల్ లెంగ్త్ పాలిటిక్స్ లోకి ఎంటరైన పవన్, ఎప్పటికైనా మరో సినిమా చేయాలని నితిన్ మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. ఇతడు నటించిన ఛల్ మోహన్ రంగ సినిమా విడుదలకు సిద్ధమైంది. మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలోకి వస్తోంది.