అసురన్ రీమేక్ దర్శకుడు ఇతడే?

Saturday,November 09,2019 - 03:20 by Z_CLU

తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు వెంకీ. కానీ ఈ రీమేక్ ను హ్యాండిల్ చేయబోయే డైరక్టర్ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. తాజాగా కొంతమంది దర్శకులకు ఈ సినిమాను ప్రత్యేకంగా చూపించారు కూడా. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది.

అసురన్ తెలుగు రీమేక్ ను హను రాఘవపూడి డైరక్ట్ చేయబోతున్నాడట. ఈ గాసిప్ లో నిజం ఎంతో తెలీదు కానీ, మేటర్ మాత్రం నమ్మేలానే ఉంది. ఎందుకంటే కొన్నాళ్లుగా మేకింగ్ కు దూరంగా ఉన్న హను, ఈ రీమేక్ కు సంబంధించి సురేష్ బాబుకు కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చాడట.

నిజానికి ఈ రీమేక్ ను క్రిష్ చేతిలో పెడదామని భావించారట సురేష్ బాబు. కానీ పవన్ తో సినిమా కోసం క్రిష్ ప్రయత్నిస్తున్నాడు. అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలీదు. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్. అందుకే హను రాఘవపూడిని లైన్లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.