మహేష్ మేనల్లుడి కోసం రామ్ చరణ్

Saturday,November 09,2019 - 03:11 by Z_CLU

ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, మహేష్ కు వరసకు మేనల్లుడు అయిన గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ హీరోగా రాబోతున్న సినిమాను రేపు గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు. రామానాయుడు స్టుడియోస్ లో రేపు ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా వెళ్లబోతున్నాడు.

నిజానికి దిల్ రాజు బ్యానర్ లో అశోక్ ను లాంఛ్ చేయాలని అనుకున్నారు. ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ మేకోవర్ అయి, ఇప్పుడు కొత్తగా ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం గల్లా కుటుంబీకులు ఏకంగా ఓ బ్యానర్ పెట్టారు.

లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఓపెనింగ్ పూర్తయిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.