బాలయ్య రూలర్ అప్ డేట్స్

Saturday,November 09,2019 - 03:38 by Z_CLU

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం `రూల‌ర్‌`. సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం `రూల‌ర్‌`. రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ రెండు షేడ్స్‌కు సంబంధించిన బాల‌కృష్ణ లుక్స్‌ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. తాజాగా సినిమాకు సంబంధించిన మ‌రో కొత్త లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ లుక్‌లో బాల‌కృష్ణ చాలా స్టైలిష్‌గా, యంగ్‌గా క‌న‌ప‌డుతున్నారు. ప‌ర్టికుల‌ర్‌గా ఈ లుక్ కోసం బాల‌కృష్ణ బ‌రువు కూడా త‌గ్గారు.

`రూల‌ర్‌` షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పుడు మున్నార్‌లో ఓ మెలోడి సాంగ్‌ను బాల‌కృష్ణ‌, వేదిక‌ల‌పై చిత్రీక‌రిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట‌ను రాశారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌మోష‌న్స్ ఇప్ప‌టికే ప్రారంభ‌మైయ్యాయి.

`జైసింహా` వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ఇదే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచనాలు నెల‌కొన్నాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

నటీనటులు:
నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా, జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు,
సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు
కొరియోగ్రఫీ: జానీ మాస్టర్