ఓవర్సీస్ లో శాతకర్ణి హంగామా

Sunday,January 22,2017 - 03:15 by Z_CLU

బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఓవర్సీస్ లో దుమ్ముదులుపుతోంది. తాజాగా ఈ సినిమా 1.5 మిలియన్ మార్క్ చేరుకుంది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు మరింత ప్రచారం కల్పించేందుకు ఓవైపు బాలకృష్ణ అమెరికా పర్యటనలో ఉంటుండగానే… సినిమా ఈ మార్క్ అందుకోవడం విశేషం. ఓవర్సీస్ లో అటు క్రిష్ కు, ఇటు బాలయ్యకు ఇదే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా అమెరికాలోని మేజర్ సెంటర్స్ లో ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది.

క్రిష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించగా… హేమమాలిని బాలకృష్ణ తల్లిగా కనిపించారు. చిరంతన్ భట్ అందించిన సంగీతం, సినిమాలో యుద్ధ సన్నివేశాలు స్పెషల్ ఎట్రాక్షన్స్ గా నిలిచాయి.