నటసింహం స్టామినాను పెంచిన శాతకర్ణి

Saturday,January 14,2017 - 11:20 by Z_CLU

నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచే మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో యూనిట్ పనిచేసింది. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత యూనిట్ నమ్మకం వందకు రెండు వందల శాతం నిజమైంది. శాతకర్ణి సినిమాకు అన్ని ఏరియాస్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాతో బాలకృష్ణ మార్కెట్ కూడా బాగా పెరిగిందంటున్నారు విశ్లేషకులు.

బాలకృష్ణ సినిమాలకు బి, సి సెంటర్లలో మార్కెట్ బీభత్సంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో బాలయ్య మార్కెట్ మరింత పెరిగినట్టు ట్రేడ్ మార్కెట్లో కనిపిస్తోంది. దీనికి కారణం శాతకర్ణి సినిమాకు మల్టీప్లెక్సుల్లో కూడా విశేష ఆదరణ దక్కడమే. తాజా సమాచారం ప్రకాారం.. ఈ సినిమాకు తొలి రోజు దాదాపు 13 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.