దేశవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన శతమానం భవతి

Saturday,January 14,2017 - 10:15 by Z_CLU

ఈ సంక్రాంతికి పరఫెక్ట్ మూవీ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన శతమానంభవతి సినిమా కాసేపటి కిందట దేశవ్యాప్తంగా గ్రాండ్ గాా విడుదలైంది. ఓవైపు సంక్రాంతి పండగను ప్రజలంతా ఆనందంగా జరుపుకుంటుంటే… మరోవైపు థియేటర్లలో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండంటూ ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా పాజిటివ్ బజ్ తో స్టార్టయింది. అన్ని సెంటర్ల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా ముందే విడుదలవ్వడం, సినిమా చాలా బాగుందని అంతా మెచ్చుకోవడంతో… సూపర్ హిట్ టాక్ తో శతమానం భవతి ఇక్కడ విడుదలైంది.

shatamanam-2-zee-cinemalu

విదేశాల్లో స్థిరపడిన తెలుగువాళ్లు బంధాలు, అనుబంధాాల్ని ఎలా మిస్ అవుతున్నారనే కోణంలో సినిమాను తెరకెక్కించారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్ని తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న నిర్మాత దిల్ రాజు… ఈ సినిమాతో తన బ్రాండ్ వాల్యూ ను మరింత పెంచుకున్నాడు. ఇక శర్వానంద్-అనుపమ పరమేశ్వరన్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ప్రకాాష్ రాజ్-జయసుధల మెస్మరైజింగ్ యాక్టింగ్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాయి. బలమైన ఎమోషన్స్ తో పాటు… మూవీలో కామెడీ ఎక్కడా మిస్ కాకుండా దర్శకుడు సతీష్ వేగేశ్న చూపించిన మేజిక్… శతమానంభవతి సినిమాను హిట్ మూవీగాా మార్చింది.