శతమానం భవతి టీం రెస్పాన్స్

Saturday,January 14,2017 - 03:00 by Z_CLU

సంక్రాంతి కానుకగా విడుదలైన శతమానం భవతి సినిమా సూపర్ హిట్ టాక్ తో తెలుగు రాష్ట్రాల్లో సందడి షురూ చేసింది. ఈ సంక్రాంతికి శర్వానంద్ మరో హిట్ కొడతాడనే అంచనాల మధ్య విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్… యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాలో నటించిన నటీనటులంతా ఈ మూవీపై తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. సినిమాలో తను చేసిన బంగార్రాజు పాాత్ర నిజంగా బంగారం అంటున్నాడు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్. శర్వానంద్-అనుపమ అద్భుతంగా నటించారని మెచ్చుకుంటున్నారు.


చాలా ఎక్సయిటింగ్ గా ఉందంటున్న హీరో శర్వానంద్… శతమానంభవతి సినిమా ఛాన్స్ రావడం తన అదృష్టంగా భావిస్తున్నాడు. ఎందుకంటే, ఇద్దరు ముగ్గురు హీరోల్ని అనుకున్న తర్వాత ఆ ఛాన్స్ తనకు దగ్గడం నిజంగా అదృష్టం అంటున్నాడు. ఈ మూవీని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటానంటున్నాడు శర్వ.

సినిమాలో కీలకపాత్ర పోషించిన ఇంద్రజ.. శతమానం భవతి యూనిట్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను కచ్చితంగా చూడాాలంటోంది ఇంద్రజ. ప్రతి ఒక్కరు తమను తాము చూసుకుంటారని… ఇంతటి గొప్ప సినిమాలో నటించడం తనకు ఆనందంగా ఉందంటోంది.


సహజ నటి జయసుధ కూడా శతమానంభవతికి ఎమోషనల్ గా కనెకక్ట్ అయ్యారు. ఎన్నో సినిమాలు చేసినా, ఈ సినిమా ఇచ్చినంత తృప్తి ఈమధ్య కాలంలో తనకు దక్కలేదంటున్నారు. తన కెరీర్ లో శతమమానంభవతి సినిమా వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని అంటున్నారు జయసుధ.


దిల్ రాజు ఏం చేసినా బాాగా చేస్తాడని అంటున్నారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. శతమానంభవతి సినిమాలో శర్వానంద్ కు తాతగా నటించిన ప్రకాష్ రాజ్… తన మనసుకు బాగా నచ్చిన సినిమాగా శతమానంభవతి సినిమాను చెప్పుకొచ్చారు. ఓ మంచి మనసుతో చేసిన ఏ ప్రయత్నమైనా సక్సెస్ అవుతందని చెప్పడానికి శతమానంభవతి సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు ప్రకాష్ రాజ్.