స్పోర్ట్స్ డ్రామాతో గోపీచంద్ ?

Sunday,September 22,2019 - 12:17 by Z_CLU

 ‘చాణక్య’ తో అక్టోబర్ లో థియేటర్స్ లోకి రాబోతున్న మ్యచో హీరో గోపీచంద్ ప్రస్తుతం గా  బిను సుబ్రహ్మణ్యం  అనే డెబ్యూ డైరెక్టర్ తో  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో  ప్రారంభించిన  గోపీచంద్ లేటెస్ట్ గా సంపత్  నంది తో ఓ  సినిమా అనౌన్స్ చేసాడు.

అయితే ఆ మధ్య వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గౌతం నంద’ ఆశించిన విజయం సాదించలేదు. అందుకే ఈసారి ఓ స్పోర్ట్స్ డ్రామాను సిద్దం చేసుకున్నారని తెలుస్తుంది. సినిమాలో గోపీచంద్ కబడ్డీ ప్లేయర్ గా నటిస్తున్నాడని కబడ్డీ నేపథ్యంలో కథ ఉంటుందని అంటున్నారు.  ప్రస్తుతానికైతే ఈ విషయంపై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ వార్త నిజామా కదా అనేది మరికొద్ది రోజులు తేలిపోనుంది.