మళ్ళీ ఆ డైరెక్టర్ తోనే?

Sunday,September 22,2019 - 12:02 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబులో ఎవరికీ లేని ఓ స్పెషల్ క్వాలిటీ ఉంది. తనతో సినిమా చేసిన దర్శకుడితో పెద్దగా గ్యాప్ లేకుండా వెంటనే సినిమా చేసేస్తాడు మహేష్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే మహేష్ కెరీర్ లో తక్కువ దర్శకులే ఉంటారు. కారణం మళ్ళీ రిపీట్ అవ్వడం. ఇప్పుడు మహేష్ మళ్ళీ ఓ దర్శకుడిని రిపీట్ చేయాలని భావిస్తున్నాడట.

ఆ దర్శకుడు ఎవరో కాదు వంశీ పైడిపల్లి. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్ళీ వంశీతో మహేష్ సినిమా అనే వార్త మొన్నటి బాగా చక్కర్లు కొట్టింది. అయితే సూపర్ స్టార్ లిస్టులో మరికొంత మంది దర్శకులు చేరడంతో వంశీతో ఇప్పుడే సినిమా ఉండదనే టాక్ వచ్చింది.

అయితే ఇప్పుడు మహేష్ వంశీతోనే సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని,  వీరిద్దరి సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.