ఘాజీ విడుదలకు లైన్ క్లియర్

Thursday,February 02,2017 - 05:30 by Z_CLU

రానా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఘాజీ. నేవీ ఆఫీసర్ గా రానా నటించిన ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. సెన్సార్ అధికారులు ఈ సినిమాకు U-సర్టిఫికేట్ ఇచ్చారు. ఈనెల 17న ఘాజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. రానా-తాప్సి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మేటనీ ఎంటర్ టైన్ మెంట్, పీవీపీ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి.

భారతీయ సినీచరిత్రలోనే ఇప్పటివరకు చూడని కథాశంతో ఘాాజీ సినిమా తెరకెక్కింది. సముద్ర గర్భంలో జరిగే యుద్ధ సన్నివేశాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 1971లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా గతంలోనే ఓ పుస్తకాన్ని రాసుకున్నాడు దర్శకుడు సంకల్ప్. అలా తను రాసిన పుస్తకాన్నే ఇప్పుడు సినిమాగా తీశాడు. సబ్ మెరీన్ లో హీరోతో పాటు మిగతా నేవీ ఆఫీసర్లంతా పాకిస్థాన్ దాడిని ఎలా తిప్పికొట్టారు… ఓ ఘోర ప్రమాదం నుంచి ఎలా సక్సెస్ ఫుల్ గా తప్పించుకున్నారనేదే ఘాజీ స్టోరీ.

gha-13
స్టార్టింగ్ నుంచి తన కెరీర్ ను విలక్షణంగా ప్లాన్ చేసుకున్న రానా… ఘాజీ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసం అంతర్జాతీయ స్థాయి నిపుణులు పనిచేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఘాజీపై అంచనాలు పెరిగాయి.