చిరంజీవి, పవన్ కాంబినేషన్ లో మూవీ

Thursday,February 02,2017 - 04:48 by Z_CLU

ఇన్నాళ్లూ మెగా ఫ్యాన్స్ కేవలం తమ కలల్లో మాత్రమే ఊహించుకున్నారు. అసలు ఆ కాంబినేషన్ సెట్ అవుతుందని మాటవరసకు కూడా అనుకోలేదు. కానీ కల కాస్తా రియాలిటీలోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలిసి సినిమా చేయబోతున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే అతిభారీ మల్టీస్టారర్ ను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి.

chiranjeevi-subbaramireddy

గతంలో రజనీకాంత్, శోభన్ బాబు, చిరంజీవి లాంటి బడా హీరోలతో సినిమాలు చేసిన సుబ్బరామిరెడ్డి చాలా ఏళ్ల కిందటే సినీనిర్మాణం నుంచి తప్పుకున్నారు. అయితే రీసెంట్ గా చిరంజీవి చేసిన ప్రతిష్టాత్మక 150వ సినిమా చూసిన టీఎస్ఆర్… మళ్లీ నిర్మాతగా మారాలని డిసైడ్ అయ్యారు. సేమ్ టైం.. చిరంజీవి-పవన్ తో మల్టీస్టారర్ తీయాలని కూడా ఫిక్స్ అయ్యారు.

pawan-subbarami-reddy

కేవలం చిరు-పవన్ తో మల్టీస్టారర్ తీయాలని అనుకోవడమే కాకుండా.. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు టీఎస్ఆర్. స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ తో సంప్రదింపులు జరిపారు. చిరంజీవి-పవన్ లాంటి ఇద్దరు హేమాహేమీల్ని హ్యాండిల్ చేయాలంటే అది త్రివిక్రమ్ వల్ల మాత్రమే అవుతుందనేది టీఎస్ఆర్ ఫీలింగ్. సుబ్బరామిరెడ్డిని ఆయన నివాసంలో 2సార్లు కలిసిన త్రివిక్రమ్.. ఈ మెగా మల్టీస్టారర్ పై చర్చలు జరిపాడు.

pawan-chiranjeevi-trivikram

ఈ సినిమాని TSR తో పాటు C. అశ్వినిదత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి కాటమరాయుడు సినిమాతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా త్రివిక్రమ్ తో ఇప్పటికే ఫిక్స్ అయిన సినిమాను స్టార్ట్ చేస్తాడు.  మరోవైపు మెగాస్టార్ తన 151వ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేయబోతున్నాడు. సో.. ఇంత బిజీ షెడ్యూల్స్ మధ్య ఈ మెగా మల్టీస్టారర్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.