'బీటెక్ బాబులు' రిలీజ్ డేట్

Saturday,December 02,2017 - 04:03 by Z_CLU

నందు, శౌర్య‌, శ్రీముఖి, రోషిణి ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్  పై ధ‌న జమ్ము నిర్మించిన సినిమా ‘బీటెక్ బాబులు’. శ్రీను ఈమంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని డిసెంబ‌ర్ 8న రిలీజ్ అవుతుంది.

ఈ సంద‌ర్భం మేకర్స్ మాట్లాడుతూ ” మంచి లవ్ స్టోరీ తో ఈ సినిమా తెరకెక్కించామని,  నందు – శ్రీముఖి మధ్య వ‌చ్చే లవ్ సీన్స్ అందరినీ  మెస్మరైజ్ చేస్తాయని… సినిమా సీరియ‌స్ గా న‌డుస్తూనే.. కామెడీ సీన్స్ తో సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తుందని. డిసెంబర్ 8న సినిమాను థియేటర్స్ కి తీసుకురాబోతున్నామని” తెలిపారు.