ఈ వీకెండ్ నన్ను మిస్ అవ్వొద్దు - విజయ్ దేవరకొండ

Tuesday,October 30,2018 - 05:04 by Z_CLU

సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ అయింది గీతగోవిందం సినిమా. ఈ సినిమాలో గోవింద్ గా యూత్ ను కట్టిపడేసిన విజయ్ దేవరకొండ, ఇప్పుడు మరోసారి అదే పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తానంటున్నాడు. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తానంటున్నాడు. ఈ వీకెండ్ తనను మిస్ అవ్వొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు.

బ్లాక్ బస్టర్ గీతగోవిందం సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం కాబోతోంది. ఈ ఆదివారం (4వ తేది) సాయంత్రం 5 గంటల నుంచి జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డీ ఛానెల్స్ లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. అంతేకాదు ఈ సినిమాను చూస్తూ వినోదంతో పాటు, మరెన్నో ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ కూడా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది జీ తెలుగు.

‘గీతగోవిందం’ టెలికాస్ట్ అయ్యే సమయంలో సినిమా గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పినవారిలో లక్కీ విన్నర్స్ కు బంపర్ బహుమతులు అందించబోతోంది జీ తెలుగు. సో.. ఈ వీకెండ్ గోవింద్ తో సరదాగా గడిపేయండి.