విశాల్ ని నేను పెళ్ళి చేసుకోవట్లేదు

Tuesday,October 30,2018 - 05:10 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ‘పందెంకోడి 2 సినిమాలో విలన్ గా ఇంప్రెస్ చేసి, ఫస్ట్ సినిమాకే తెలుగు ఆడియెన్స్ దగ్గర 100 మార్కులు కొట్టేసింది వరలక్ష్మి. ఆ ఇంపాక్ట్ ఇంకా తగ్గనే లేదు, అప్పుడే విజయ్ ‘సర్కార్’ సినిమాలో మరో కీ రోల్ లో కనిపించనుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరలక్ష్మి విశాల్ కి తనకు ఉన్న రిలేషన్ షిప్ ని రివీల్ చేసింది.

“విశాల్ నాకు బెస్ట్ ఫ్రెండ్. మా ఫ్రెండ్ షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది అందులో అనుమానం లేదు. కానీ మా మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప ఇంకేమీ లేదు. అసలు నేను విశాల్ ని పెళ్ళి చేసుకోవడం లేదు.’ అని క్లారిటీ ఇచ్చింది.  

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి నా సోల్ మేట్ అని విశాల్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. వరలక్ష్మి ఆ స్టేట్ మెంట్ ని సమర్థిస్తూ, ‘ఫ్రెండ్స్ గా మా రిలేషన్ షిప్ చాలా స్ట్రాంగ్ కాబట్టే విశాల్ అలా ఫీల్ అవుతాడు, అంతే తప్ప అందరూ అనుకుంటున్నట్టు మా మధ్య ఇంకేమీ లేదు’ అని రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది వరలక్ష్మి శరత్ కుమార్.