గీతగోవిందం టీజర్.. ఇనిస్టెంట్ హిట్

Monday,July 23,2018 - 01:28 by Z_CLU

అమ్మాయిల దృష్టిలో ఒకసారి బ్యాడ్ బాయ్ గా ముద్రపడిందంటే ఇక అంతే సంగతి. మంచోడు అనిపించుకోవడానికి అష్టకష్టాలు పడాలి. సరిగ్గా ఇదే లైన్ మీద తెరకెక్కింది గీతగోవిందం సినిమా. గీత అనే అమ్మాయి దృష్టిలో బ్యాడ్ బాయ్ అనిపించుకున్న గోవింద్.. తిరిగి ఆమెను ఎలా ఇంప్రెస్ చేశాడో తెలుసుకోవాలంటే గీతగోవిందం చూడాల్సిందే.

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా హంగామా షురూ అయింది. కొద్దిసేపటి కిందట గీతగోవిందం టీజర్ రిలీజైంది. 25 ఏళ్ల గోవింద్ అనే కుర్రాడిలా విజయ్ దేవరకొండ, గీత అనే అమ్మాయిగా రష్మిక పెర్ ఫెక్ట్ గా సింక్ అయ్యారు.

సినిమాకు సంబంధించి ఓ సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్ అవ్వడం, టీజర్ పై అంచనాలు పెంచేసింది. ఆ అంచనాలకు తగ్గట్టే రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది గీతగోవిందం టీజర్. ఈ సినిమా ఆడియోను ఈనెల 29న రిలీజ్ చేయబోతున్నారు.

శ్రీరస్తు శుభమస్తు తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని మరీ గీతగోవిందం కథ రాసుకున్నాడు దర్శకుడు పరశురాం. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. అల్లు అరవింద్ ప్రజెంటర్. ఆగస్ట్ 15న సినిమా థియేటర్లలోకి రానుంది.