'సాక్ష్యం' ప్రొడ్యూసర్ అభిషేక్ నామా ఇంటర్వ్యూ

Monday,July 23,2018 - 12:38 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సాక్ష్యం’. ఈ నెల 27 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ అభిషేక్ నామా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

ఇదే ఫస్ట్ టైమ్…

‘సాక్ష్యం’ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీ లో పంచభూతాలనే 5 ఎలిమెంట్స్ పై ఇప్పటి వరకు సినిమా రాలేదు. మేము ఫస్ట్ టైమ్ ట్రై చేశాము…

అదే సినిమా…

ఎవరు చూడకుండా ఒక తప్పు చేసేసి, ఎవరి కంటా పడలేదు కాబట్టి ప్రాబ్లమ్ లేదు అనుకుంటే సరిపోదు.. కర్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది. అది మనం చేసిన పాపం పండిన రోజు, తప్పకుండా శిక్షిస్తుంది అదే ఈ సినిమా లైన్..

అలా కలిసొచ్చింది…

సినిమాలో జస్ట్ ఫాంటసీ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా యాక్షన్, లవ్, ఫ్యామిలీ డ్రామా ప్రతీది పర్ఫెక్ట్ గా  కలిసొచ్చాయి ఈ కథలో…

ఏదీ కావాలని చేయలేదు…

సినిమాలో ఏదీ కావాలని పెట్టుకోలేదు.. సాంగ్స్ కూడా  సిచ్యువేషన్, కథకి తగ్గటుగా ఉంటాయి. లొకేషన్ విషయంలో కూడా అంతే… యాక్షన్ ఎలిమెంట్స్ కూడా పంచ భూతాలనే కాన్సెప్ట్ ని ఎలివేట్ చేస్తూనే ఉంటాయి…

 

కంటెంటే కింగ్…

భారీ బడ్జెట్ సినిమా చేయాలని చేసిన సినిమా కాదిది. కథ డిమాండ్ చేసింది కాబట్టే బడ్జెట్ అయింది. U.S. లో అద్భుతమైన లొకేషన్ లలో సినిమాని తెరకెక్కించడం జరిగింది. కావాలని అక్కడికి వెళ్లి షూట్ చేయలేదు. అది స్టోరీలో పార్ట్.. స్టోరీని డిమాండ్ చేసింది కాబట్టే, కాశీ లో షూట్ చేశాం… బడ్జెట్ తగ్గించుకుందామని చీట్ చేసి నేను హైదరాబాద్ లో షూట్ చేయించలేను… అవసరం ఉంది కాబట్టే బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది…

అసలెందుకు సినిమా చూడాలి..?

ఆడియెన్స్ కొత్తదనం కోరుకుంటున్నారు. థియేటర్ కి వచ్చి సినిమా  చూడాలనే  రేంజ్  క్యూరియాసిటీ క్రియేట్ చేసినప్పుడే థియేటర్ కి వస్తారు.  నేను సాక్ష్యం కథ విన్నప్పుడే  క్యూరియస్ అయిపోయాను. పంచభూతాల పై సినిమా అనగానే కొత్తగా అనిపించింది. దానికి  తోడు లవ్, ఫ్యామిలీ డ్రామా.. సినిమా సక్సెస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సినిమాలో ఉన్నాయి…

హీరో చాలా కష్టపడ్డాడు…

ఈ సినిమాలో కొత్త బెల్లంకొండ శ్రీనివాస్ ని చూస్తారు. సినిమాకోసం చాల కష్టపడి మేకోవర్ చేశాడు. యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు, ఇమోషన్ సీన్  లలో కొత్త శ్రీనివాస్ ని చూస్తారు…

 

ప్రతి రూపాయి కనిపిస్తుంది…

ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టేశామనే ఫీలింగ్ నాకు లేదు. పెట్టిన ప్రతి రూపాయి మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. అంత గ్రాండియర్ గా తెరకెక్కింది సినిమా.. కథ నచ్చింది కాబట్టే టెక్నీషియన్స్ దగ్గరి నుండి ఆర్టిస్ట్ ల  వరకు  ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు..

140 సినిమాల అనుభవం…

నాన్నగారు ఆయన కరియర్ లో 140 సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేశారు… నేను పుట్టినప్పుడు పెట్టిన బ్యానర్ మాది. అంత అనుభవం ఉంది కాబట్టే ఏ సినిమా చేసినా ఆడియెన్స్ పల్స్ ని బట్టే డెసిషన్ తీసుకుంటాం… మా  ప్రొడక్షన్  బ్యానర్ లో ఇది 4  వ సినిమా… గూఢచారి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది…

13 నిమిషాల సాంగ్…

పంచభూతాల పై ఉండే సాంగ్ సినిమాలో 13 నిమిషాలు ఉంటుంది. ఈ సాంగ్ కోసం ఇండియాలోనే బెస్ట్ సింగర్స్ బాలు, హరిహరన్, జేసుదాస్, బోంబే జైశ్రీ, కైలాష్ ఖేర్ కలిసి పాడారు. సినిమాలో ఈ సాంగ్ హైలెట్ అవుతుంది…

 

అదీ బడ్జెట్…

సినిమాలో నలుగురు విలన్స్ ఉంటారు… రవి కిషన్, ఆశుతోష్ రాణా, జగపతి బాబు, మధు గురు స్వామి. మొత్తం సినిమాలో 48 మంది ఆర్టిస్టులు నటించారు. బిగినింగ్ లో 30 కోట్లతో చేద్దామనుకున్న సినిమా కంప్లీట్ అయ్యేసరికి 34 కోట్లు అయింది…

సినిమా గురించి…

కొత్త కాన్సెప్ట్ ని కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాం… అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా…