రామ్ చరణ్ ఇమోషనల్ స్పీచ్ – హ్యాప్పీ వెడ్డింగ్

Monday,July 23,2018 - 02:36 by Z_CLU

నిహారిక హ్యాపీ వెడ్డింగ్ ఈ నెల 28 న రిలీజవుతుంది. అయితే రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా అటెండ్ అయిన రామ్ చరణ్ ఈ ఈవెంట్ లో మెగాస్టార్ లైఫ్ లోని ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నాడు. స్పెషల్ గా ఆ విషయాన్ని షేర్ చేయడానికే ఆ ఈవెంట్ కి వచ్చినట్టు చెప్పుకున్నాడు చెర్రీ.

M.S. రాజు గారి ఫాదర్ ప్రొడ్యూసర్ గా ఉన్న రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి కి 5000 రూపాయలు అవసరమవ్వడంతో, ఆయన అప్పటికే సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్స్ కూడా, అడ్వాన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్న టైమ్ లో M.S. రాజు గారి ఫాదర్, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 5000 రూపాయలు తీసి ఇచ్చారట. ఆయన గొప్పతనాన్ని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ఇమోషనల్ గా చెప్పుకున్నాడు చెర్రీ.

 

అంత గొప్ప కుటుంబం లోంచి వచ్చిన సుమంత్ అశ్విన్ కరియర్ లో ఇంకా ఎన్నో హైట్స్ కి రీచ్ అవ్వాలని కోరుకున్న చెర్రీ, హ్యాపీ వెడ్డింగ్ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు. 

లక్ష్మణ్ కార్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని UV క్రియేషన్స్  బ్యానర్ తో పాటు  పాకెట్ సినిమా నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ కంపోజర్.