నాని దర్శకుడితో రామ్ చరణ్... నిజమెంత?

Friday,May 29,2020 - 01:54 by Z_CLU

ఇండస్ట్రీలో రూమర్లు కామనే. ఎప్పటికప్పుడు ఆ దర్శకుడు ఈ హీరోతో సినిమా, స్టార్ హీరో ఆ దర్శకుడితో సినిమా చేస్తున్నాడంటూ గాసిప్స్ పుట్టుకొస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ కాంబినేషన్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడనేది ఆ రూమర్. అవును ఇది జస్ట్ రూమర్ మాత్రమే.

ఈ విషయాన్ని గౌతమ్ దగ్గరికి తీసుకు వెళ్తే చరణ్ తో సినిమా అనేది గాసిప్ అని, అందులో నిజం లేదని చెప్పాడు. నెక్స్ట్ సినిమా గురించి ఇంకా ఎలాంటి డిస్కషన్ లేదని తేల్చి చెప్పాడు.

గౌతమ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా హిందీలో షాహిద్ కపూర్ తో తీస్తున్న ‘జెర్సీ’ రీమేక్ పైనే పెట్టాడు. ఆ సినిమా పూర్తయ్యాకే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తాడు.