లాక్ డౌన్ చిట్ చాట్ - సమంత

Friday,May 29,2020 - 01:57 by Z_CLU

– గోంగూర పచ్చడి ఎప్పుడైనా తిన్నారా
చాలాసార్లు తిన్నాను.. గోంగూర మొక్కలు పెంచుతున్నాను కూడా

– మామిడి పండ్లు తింటున్నారా
ప్రతి రోజూ 2 తింటున్నాను

– ఓ సెలబ్రిటీగా బాగా కష్టపని పని ఏంటి
మనకు సంబంధించిన అబద్ధాల్ని మనమే వినాల్సి రావడం

– కాఫీ లేదా టీ
ఎప్పుడైనా, ఎక్కడైనా బ్లాక్ కాఫీ

– ఈ లాక్ డౌన్ టైమ్ లో నేర్చుకున్న వంటకం
షక్ షుకా (గుడ్డు, టమాటతో చేసే బ్రేక్ ఫాస్ట్)

– ఈ క్వారంటైన్ టైమ్స్ ఫిట్ గా ఉండేందుకు ఫాస్టింగ్ ఉంటున్నారా
పూర్తిస్థాయిలో ఫాస్టింగ్ (ఉపవాసం) ఉండను. నామమాత్రంగా అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేస్తుంటాను. ఎందుకంటే రోజుతప్పించి రోజు నాకు బిర్యానీ ఉండాల్సిందే. అంతేకాదు.. ఆల్రెడీ 3 బాటిల్స్ పచ్చళ్లు ఖాళీచేశాను. ఎందుకంటే స్పైసీ ఫుడ్ అంటే నాకిష్టం. సో.. ఫాస్టింగ్ అనేది నన్ను మళ్లీ గుడ్ గర్ల్ గా మారుస్తుందనుకుంటున్నాను.