హాట్ టాపిక్ : భవిష్యవాణి చెప్పిన సూర్య సినిమాలు

Friday,May 29,2020 - 01:45 by Z_CLU

కొన్ని సినిమాల్లో కొన్ని విషయాలను భలేగా ప్రస్తావిస్తారు. అవి నిజజీవితంలో జరిగితే కనుక కచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది. ఓ మూడు సినిమాల్లో ఉన్న సంఘటనలు ఇప్పుడు జరుగుతుండటంతో ఔరా అంటూ అందరు షాక్ అవుతున్నారు. ఆ సినిమాలన్నీ హీరో సూర్యవి కావడం మరో ఆసక్తికర విషయం.

కరోనా వైరస్ మన దేశంలోకి రాగానే అందరికీ సూర్య హీరోగా చేసిన ‘సెవెన్త్ సెన్స్’ గుర్తొచ్చింది. అందరికి ఆ సినిమాలో సన్నివేశాలు స్ట్రైక్ అయ్యాయి. ఇప్పుడు మిడతల దాడి అంటూ బెంబేలెత్తిస్తున్న టాపిక్ కూడా సూర్య ‘బందో బస్త్’ సినిమాలో చూపించిందే. దాంతో సూర్య హీరోగా నటించిన ఆ సినిమాలో మిడతల సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

అంతే కాదు ఇటీవలే వైజాగ్ లో గ్యాస్ లీక్ అయినప్పుడు కుడా సూర్య నిర్మాతగా తెరకెక్కించిన ‘ఉరియది 2’ సినిమాను గుర్తుచేసుకున్నారు సినీ లవర్స్. ఇలా వరుస పెట్టి సినిమాల్లో చూపించినవి నిజజీవితంలో జరుగుతుండటంతో సూర్య సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.