గౌతమీపుత్ర శాతకర్ణి ఎట్రాక్షన్స్

Wednesday,January 11,2017 - 04:32 by Z_CLU

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సెట్స్ పైకి వచ్చిన క్షణం నుంచి ఫ్యాన్స్ ఆ సినిమాకి సంబంధించిన చిన్న అప్ డేట్ వచ్చినా ఫీస్ట్ లా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాను మిస్ కాకుండా ఉండటానికి బాలయ్య ఫ్యాన్స్ కి రీజన్స్ అవసరం లేకపోయినా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా మరెన్నో సర్ ప్రైజెస్ తో ప్యాక్ అయింది. ఈ సినిమాలోని స్పెషల్ ఎట్రాక్షన్స్ లో కొన్ని…

1

బాలయ్య కరియర్ లో వందో సినిమా కావడమే ఈ సినిమా పట్ల ఇంటరెస్ట్ ని క్రియేట్ చేసింది. బాలయ్య కూడా ఈ సినిమాకు క్రియేట్ అయిన హైప్ ని మైండ్ లో పెట్టుకునే దానికి సరితూగే స్థాయిలో సబ్జెక్ట్ ని,  డైరెక్టర్ ని ఎంచుకున్నాడు.

2

ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్స్ ఉన్నా, క్రిష్ సినిమాలది స్పెషల్ జోనర్. ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైనా స్పెషల్ గా ట్రీట్ చేస్తాడనేది బ్రాండెడ్ టాక్.

3

 ఈ సినిమాకి స్టోరీ లైనే పెద్ద ఎసెట్. తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో కంపల్సరీగా చూడాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఫిక్స్ అయిపోయింది.

4

 బాలకృష్ణకు తల్లిగా నటించిన హేమామాలిని ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఎప్పుడో సీనియర్ NTR తో పాండవ వనవాసం సినిమాలో నటించిన ఈ డ్రీమ్ గర్ల్ మళ్ళీ ఇన్నాళ్ళకు తెలుగు స్క్రీన్ పై కనిపించింది.

5

బాలకృష్ణ సరసన వశిష్టి దేవిగా నటించిన శ్రియ కూడా ఈ సినిమాలో స్పెషల్ గా కనిపించనుంది. శాతకర్ణి భార్యగా కనిపించనున్న శ్రియ… సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. శ్రియ నటనకు వందకు 150 మార్కులు వేస్తానని  బాలయ్య అన్నారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు.

6

 గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా యుద్ధంతో మొదలై యుద్ధంతోనే ముగుస్తుంది. గ్రీకు రాజుతో శాతకర్ణి చేసే  యుద్ధంలో 1000 మంది సైనికులు, 300 గుర్రాలతో గ్రాండ్ గా తెరకెక్కించాడు క్రిష్. ప్రతి యుద్ధ సన్నివేశం ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.

7

బాలయ్య సినిమాలంటేనే హై ఎండ్ ఎనర్జీ లెవెల్ ని ఇంక్రీజ్ చేసే డైలాగ్స్ ఉంటాయి. అలాంటిది హిస్టరీ మేడ్ కింగ్ క్యారెక్టర్ లో కనిపించనున్న బాలయ్య డైలాగ్స్ కూడా ఆ లెవెల్ లోనే ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికే ట్రయిలర్ తో శాంపిల్ చూపించాడు నటసింహం.

8

ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు మ్యూజిక్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే, వాటిని స్క్రీన్ పై చూడాలన్న ఇంటరెస్ట్ ని కూడా పెంచాయి. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చిరంతన్ భట్ అందించిన మ్యూజిక్ కూడా ఎట్రాక్టివ్ ఎలిమెంటే.

9

 జార్జియా లోని సరికొత్త లోకేషన్స్ లో తెరకెక్కిన వార్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి స్పెషల్ ఎలిమెంట్. మరీ ముఖ్యంగా రియల్ గా కురుస్తున్న వర్షంలో తీసిన యుద్ధసన్నివేశాలు అద్భుతంగా వచ్చాయంటోంది యూనిట్.

10

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కన్నడలో కాకుండా ఇతర భాషల్లో నటించడం ఇదే ఫస్ట్ టైం. ఆయన్ని అంతగా ప్రభావితం చేసిన రోల్ ఏమై ఉంటుందా అన్న ఆసక్తి రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూనే ఉంది.