సంక్రాంతి సప్రయిజ్ అదే....

Wednesday,January 11,2017 - 03:33 by Z_CLU

నేచురల్ స్టార్ నాని దిల్ రాజు నిర్మాణంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నేను లోకల్’ ఈ సంక్రాంతికి సందడి చేయబోతుంది. ఇప్పటికే ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలు హంగామా చేయడానికి రెడీ అవుతుండగా నేను లోకల్ అంటూ టీజర్ తో రెడీ అవుతున్నాడు నాని.

  దేవిశ్రీ ప్రసాద్ కంపోస్ చేసిన ఈ సినిమాలోని ‘నెక్స్ట్ ఏంటి’ అనే సాంగ్ ను జనవరి 6న రిలీజ్ చేయాలనుకున్న యూనిట్ ఆ సాంగ్ ను జనవరి 12 కి పోస్ట్ పోన్ చేసి ఆ సాంగ్ తో పాటు మరో సప్రయిజ్ కూడా ఉందని అనౌన్స్ చేశారు.అయితే ఆ సప్రయిజ్ మరేదో కాదని, సినిమా టీజర్ ను సంక్రాంతి శుభాకాంక్షలతో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయిందట యూనిట్. అంటే సాంగ్ తో పాటు సంక్రాంతికి టీజర్ తో కూడా సందడి చేయబోతున్నారన్నమాట.