Rajasekhar - షార్ట్ గ్యాప్ లో మరో సినిమా

Saturday,February 06,2021 - 04:55 by Z_CLU

మొన్ననే పుట్టినరోజు సందర్భంగా Shekar అనే కొత్త ప్రాజెక్టును ఎనౌన్స్ చేశారు రాజశేఖర్. అది అతడి కెరీర్ లో 91వ సినిమా. ఇప్పుడు షార్ట్ గ్యాప్ లో తన 92వ సినిమాను కూడా ఎనౌన్స్ చేశారు ఈ సీనియర్ హీరో.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ఓ కొత్త సినిమాను ఈరోజు ప్రకటించారు. ఆయన 92వ చిత్రమిది. ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘గతం’ ఫేమ్ కిరణ్ కొండమడుగుల దర్శకత్వంలో రాజశేఖర్ నటించనున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా.

Rajasekhar 92nd movie Gatham director Kiran 1

ఆఫ్ బీట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్, ఎస్ ఒరిజినల్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. ‘గతం’ నిర్మాతలు భార్గవ పోలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎర్రబోలు… రాజశేఖర్ కుమార్తెలు శివాని-శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సినిమా థీమ్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న ‘శేఖర్’ పూర్తయిన తర్వాత ఆగస్టులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు.

ఇదొక యాక్షన్ థ్రిల్లర్. యాంటీ సోషల్ ఎలిమెంట్ సెక్స్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సినిమా నడుస్తుంది. కథ ప్రకారం, సినిమా అంతా అమెరికాలో షూట్ చేస్తారు.