'శేఖర్' ట్రైలర్ రివ్యూ

Thursday,May 05,2022 - 03:40 by Z_CLU

Dr Rajasekhar’s ‘Shekar’ Trailer Review

డా. రాజశేఖర్ హీరోగా జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శేఖర్’ సినిమా ఈ నెల 20న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల పదహారు సెకన్ల నిడివితో కట్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసి సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది.

సినిమాలో రాజశేఖర్ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కేరెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని ట్రయిలర్ లో చెప్పేశారు. టిపికల్ కేసుల విషయంలో పోలీసులు శేఖర్ హెల్ప్ తీసుకొని అతని సేవలను వాడుకుంటారని , ఈ క్రమంలో ఓ యాక్సిడెంట్ కేసుని శేఖర్ తన ఇంటలెక్చువల్ మైండ్ తో ఎలా సాల్వ్ చేశాడనే విజువల్స్ తో ట్రైలర్ సినిమాపై ఆసక్తి నెలకొలుపుతుంది. అలాగే సినిమాలో శేఖర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా హైలైట్ కానుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. తండ్రి కూతురు మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాకు ప్లస్ కానున్నాయనిపిస్తుంది.

మల్లి కార్జున్ కెమెరా విజువల్స్ , అనూప్ రుబెన్స్ స్కోర్ ట్రైలర్ ని ఎలివేట్ చేశాయి. ఓవరాల్ గా ఎంగేజింగ్ ట్రైలర్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీ రైజ్ చేసి బజ్ క్రియేట్ చేయడంలో  మేకర్స్ సక్సెస్ అయ్యారు. జీవిత రాజశేఖర్ స్క్రీన్ ప్లేతో పాటు  దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బీరం సుధాకర్ , శివాని రాజశేఖర్ , శివాత్మిక , బొగ్గారం శ్రీనివాస్ నిర్మాతలు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics