Shekar Movie - సంక్రాంతి బరిలో రాజశేఖర్ సినిమా

Tuesday,November 02,2021 - 01:56 by Z_CLU

Dr.Rajasekhar’s ‘Shekar’ Movie in Sankranti Race

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఉపశీర్షిక. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచింది.

సంక్రాంతికి గట్టి పోటీ ఉంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7కి షెడ్యూల్ అయి ఉంది. ప్రభాస్ రాధేశ్యామ్, జనవరి 14కి రెడీగా ఉంది. ఈ రెండు సినిమాల మధ్యలో సర్కారువారి పాట, భీమ్లానాయక్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇలాంటి టఫ్ కండిషన్స్ మధ్య శేఖర్ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు రాజశేఖర్.

SHEKAR movie rajasekhar

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. సెకెండ్ వేవ్ కారణంగా షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత అరకులో షెడ్యూల్ మొదలుపెట్టి 75శాతం సినిమా పూర్తిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్, శ్రీశైలంలో మరో 2 షెడ్యూల్స్ చేశారు. దీంతో టోటల్ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా నడుస్తోంది.

ఈ సినిమాలో రాజశేఖర్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో రఫ్ గా కనిపించబోతున్నారు. మలయాళీ బ్యూటీ అను సితార హీరోయిన్ గా పరిచయమౌతోంది. జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్ సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

ఆర్ట్: దత్తాత్రేయ
రైటర్: లక్ష్మీ భూపాల
ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లలిత్
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ